వృద్యాప్యంలో ఆసరానిచ్చే అటల్‌ పెన్షన్‌ యోజన !

Telugu Lo Computer
0


టల్‌ పెన్షన్‌ యోజనలో రోజుకు కేవలం రూ. 7 ఆదా చేయడం ద్వారా మీరు నెలకు రూ.5 వేల పెన్షన్ పొందవచ్చు. 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే రోజుకు రూ.7 మాత్రమే చెల్లించాలి. అంటే నెలకు రూ.210 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లింపు కొనసాగించాలి. అయితే వయస్సు పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది. మీరు సమీపంలోని బ్యాంకుకో వెళ్లి ప్రధాన మంత్రి అటల్  పెన్షన్ యోజన పథకంలో చేరొచ్చు. 19 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.228 చెల్లించాలి. 20 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.248, 21 ఏళ్లుంటే రూ.269, 22 ఏళ్ల వయస్సుంటే నెలకు రూ.292, 23 ఏళ్ల అయితే నెలకు రూ.318, 24 ఏళ్లు అయితే నెలకు రూ.346, 25 ఏళ్లకు నెలకు రూ.376, 26 ఏళ్లకు నెలకు రూ.409, 27 ఏళ్లకు నెలకు రూ.446, 28ఏళ్లకు నెలకు రూ.485, 29 ఏళ్లకు నెలకు రూ.529 చెల్లించాలి. 30 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.577 చెల్లించాలి. 31 సంవత్సరాలకు నెలకు రూ.630, 32 సంవత్సరాలకు నెలకు రూ.689 చెల్లించాలి. 40 ఏళ్లు ఉంటే నెలకు రూ.1454 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)