సచిన్ టెండుల్కర్ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం చూసి అతడి నిరాడంబరతకు అభిమానులంతా ఫిదా అయ్యారు. సచిన్ టెండుల్కర్ సైతం తనను విష్ చేసిన వారికి నమస్కరిస్తూ హుందాతనాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం ట్రావెల్ మూడ్‌లో ఉన్నాడు. కుటుంబంతో కలిసి కశ్మీర్ సందర్శనకు వెళ్లినట్లు ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ''భూతల స్వర్గం కశ్మీర్'' అంటూ విమానం నుంచి కశ్మీర్ అందాలు వీక్షిస్తున్న వీడియోను సచిన్ పంచుకున్నాడు.
సచిన్ నిరాడంబరతకు అభిమానులు ఫిదా !
February 21, 2024
0
Tags