2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6 శాతంగా ఉండొచ్చని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అంచనా వేస్తోంది. ఆర్‌బీఐ అంచనా 6.50 శాతంగా ఉంది. ప్రభుత్వ వ్యయంలో మందగమనం, రుతు పవనాలు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేశాయని, ఇది పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై ప్రభావం చూపనుందని ఐసీఆర్ఏ పేర్కొంది. ఫిబ్రవరి 29న ప్రభుత్వం అధికారిక డేటాను విడుదల చేయనుంది. సేవారంగంలో మెరుగుదల ఉన్నప్పటికీ పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో మందగమనం కారణంగా 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 7.40 శాతంగా ఉన్న జీవీఏ వృద్ధి 3వ త్రైమాసికంలో 6 శాతానికి తగ్గవచ్చని ఐసీఆర్ఏ పేర్కొంది.
మూడవ త్రైమాసికంలో భారత జీడీపీ 6 శాతం ?
February 21, 2024
0
Tags