లక్నో జైలులో 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని లక్నో జైలులో ఖైదీలకు హెచ్‌ఐవీ సోకడంతో కలకలం మొదలైంది. యూపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల తో ఆరోగ్య శాఖ జైలులో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించింది. జైలులో కొత్తగా 36 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. ఖైదీల ఈ పరీక్ష డిసెంబర్ 2023లో జరిగింది. దీంతో జైలులో మొత్తం 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ రోగ నిర్ధారణ జరిగింది. దీని తర్వాత జైలు పరిపాలన అప్రమత్తమైంది. ఖైదీలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అందరూ KGMUలోని యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఖైదీలకు హెచ్ఐవీ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)