ఈ నెల అయోధ్యలో తలపెట్టిన రామాలయ ప్రతిష్ట దశలో ఓ కీలక ఘట్టం కూడా ఉంటుంది. అత్యంత భారీ స్థాయి దియా అంటే మట్టి దీపం లేదా ప్రమిదను ప్రతిష్టాపన దశలో వెలిగిస్తారు. రాముడి కాలం త్రేతాయుగం ప్రతీకగా ఈ జ్యోతిని ప్రజ్వలింపచేస్తారు. ఈ విషయాలను స్థానిక ప్రముఖులు కొందరు వార్తాసంస్థలకు తెలిపారు. రామాయణ కాలంలో ఈ భారీ దీపాల వెలిగింపు ఆనవాయితీగా ఉండేది. ఇక్కడ ఇప్పుడు వెలిసే దాదాపు 28 మీటర్ల మేర వెడల్పుగా ఉండే ఈ దీపాన్ని దశరథ దీప్గా వ్యవహరిస్తారు. రాముడి తండ్రి దశరథుని పేరిట ఈ జ్యోతి వెలుస్తుంది. ఇక ఈ దీప ప్రజ్వలనకు దాదాపు కనీసం 21 క్వింటాళ్ల చమురు అవసరం అవుతుంది.
అయోధ్యలో దశరథ దీప్ ?
January 05, 2024
0
Tags