తమిళనాడులో వందల ఏళ్ల క్రితం నుంచి రెక్లా రేసు క్రీడలు జరిపించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇది ఒక సాంప్రదాయ క్రీడ. ప్రతి ఏడాది పొంగల్ సందర్భంగా బోగీ, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఈ రేసులు జరుగుతాయి. ఈ రేసులో ఎద్దుల బండ్లను కాకుండా చిన్న పరిమాణంలో తేలికగా ఉండే చక్రాల బండ్లను వినియోగిస్తారు. ఈ బండ్లనే రెక్లాలు అంటారు. ఒక ఎద్దు బండ్లతోగానీ, రెండు ఎద్దుల బండ్లతోగానీ ఎలాగైనా ఈ రేసును నిర్వహించుకోవచ్చు. ఈ రేసులో గెలిచిన వారికి జల్లికట్టు క్రీడలో మాదిరిగానే బహుమతులను ప్రదానం చేస్తారు.
తమిళనాడులో రెక్లా రేసులు !
January 14, 2024
0
Tags