హోటల్ లోకి ఎస్సీలను రావద్దని చెప్పిన యజమాని ?

Telugu Lo Computer
0


ర్ణాటకలోని బళ్లారి సమీపంలోని కురుగోడు తాలూకా గుత్తిగనూరు గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు శేఖరప్ప, అయ్యప్ప, పరుశురామ్, రమేష్‌, మహేష్‌లు గుత్తిగనూరు బాలాపూర్‌ రోడ్డులోని వీరభద్రప్ప హోటల్‌ లో టిఫిన్ చేసేందుకు వెళ్లగా ఆ హోటల్‌ యజమాని వీరభద్రప్ప వారిని అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మీరు హోటల్‌లోకి వెళ్లకుడదని, హోటల్ బయట కుర్చుని టిఫిన్ చెయ్యాలని వాళ్లను హోటల్ బయట కూర్చోవాలని ఆ హోటల్ యజమాని వీరభద్రప్ప సూచించారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా మమ్మల్ని అంటరానితనం పేరుతో హోటల్ బయట కుర్చోమని చెప్పడం సరికాదని హోటల్ యజమాని వీరభద్రప్ప, ఆయన భార్య నాగవేణితో ఎస్సీ కాలనీకి చెందిన వాళ్లు వాదనకు దిగారని తెలిసింది. మీరు హోటల్ లోకి వస్తే మా హోటల్ లో టిఫిన్ తింటున్న వాళ్లు బయటకు వెళ్లిపోతారని, మరోసారి వాళ్లు మా హోటల్ లోకి రారని, మీ మీద జాలి చూపిస్తే మాకు వ్యాపారంలో నష్టం వస్తుందని వీరభద్రతప్ప, ఆయన భార్య ఎస్సీ కాలనీవాళ్లకు తేల్చి చెప్పారని ఆరోపణలు ఉన్నాయి. తమను అనరాని మాటలతో దూషించారని శేఖరప్ప శుక్రవారం కురుగోడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కురుగోడు పోలీసు అధికారులు, తహసీల్దార్ రాఘవేంద్రరావు గ్రామాన్ని సందర్శించి శాంతి సమావేశం నిర్వహించారు. అయితే హోటల్ యజమాని మీద కేసు నమోదు చెయ్యకుండా పోలీసులు రాజీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఎస్సీ కాలనీకి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. హోటల్ యజమాని మీద కేసు నమోదు చెయ్యకపోతే తాము బళ్లారి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఎస్సీ కాలనీకి చెందిన కొందరు పోలీసులను హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)