మహారాష్ట్రలో ముంబై-జల్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్తున్నది. అయితే ఒక వ్యక్తి టాయిలెట్లో సిగరెట్ తాగాడు. ఆ పొగ వల్ల ఫైర్ అలారం మోగింది. ఆ వెంటనే ఆటోమేటిక్‌గా మంటలు ఆర్పే పరికరం యాక్టివేట్ అయ్యింది. దీంతో వేగంగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. కాగా, ఒక కోచ్‌లోని టాయిలెట్లో వ్యక్తి స్మోక్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు రైల్వే టీసీ, పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాసిక్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఆ వ్యక్తిని దించివేశారు.
టాయిలెట్లో స్మోక్ చేసిన వ్యక్తి - ఆగిన వందే భారత్ !
January 10, 2024
0
Tags