పొగ మంచు వల్ల చెన్నై వెళ్లాల్సిన విమానాలు శంషాబాద్‌కు మళ్లింపు

Telugu Lo Computer
0


మిళనాడులోని చెన్నై నగరంలో ఆదివారం ఉదయం తీవ్రమైన స్థాయిలో పొగమంచు చుట్టు ముట్టింది. దీంతో చెన్నై వెళ్లాల్సిన పలు విమానాలని తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచుతో చెన్నై ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలో ప్రతికులమైన వాతావరణం కారణంగా చెన్నై, ఢిల్లీకి సంబంధించిన పలు విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ 'ఎక్స్‌' ట్విటర్‌లో పేర్కొంది. విమాన ప్రయాణికులు ఎప్పటికప్పుడు ముందుగానే విమాన వివరాలు తెలుకోవాలని సూచించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)