జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై నటుడు ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారం తారక్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జపాన్‌లోనే ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ''గత వారతమంతా అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలి'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జపాన్‌లో సోమవారం దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందినట్లు.. పలువురు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా సంభవించిన ఈ భూకంపాలతో తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలంతా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ తరువాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.
గత వారం అక్కడే ఉన్నా !
January 02, 2024
0
Tags