స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటన వెలువరించారు. దేశంలో మతసామరస్యం, శాంతి విచ్ఛిన్నతకు ఈ సంస్థ పలు విధాలుగా విద్వేష ప్రచారానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ నిషేధం విధించారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణువంత అయినా ఉపేక్షించబోదని, ఇందులో భాగంగానే ఇప్పుడు ఇటువంటి సంస్థపై నిషేధం కొనసాగించినట్లు అమిత్ షా వెల్లడించారు.
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం పొడిగింపు !
January 29, 2024
0
Tags