దేశంలో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది !

Telugu Lo Computer
0


దేశంలో విద్యుత్‌కు భారీగా డిమాండ్‌ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొమ్మిది శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య దేశంలో మొత్తం మీద విద్యుత్‌ వినియోగం 1099.90 బిలియన్ యూనిట్లుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో విద్యుత్‌ వినియోగం 1010.20 బిలియన్ యూనిట్లుగా ఉన్నది. 2021-22 సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో మొత్తం వినియోగం 916 బిలియన్ యూనిట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వినియోగం 1504.26 బిలియన్ యూనిట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1374 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో విద్యుత్‌ వినియోగం 9 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థలో భూమ్‌ కారణమని ఇంధనరంగ నిపుణులు పేర్కొటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో దేశంలో విద్యుత్ వినియోగం 50.8 శాతం పెరిగిందని కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2013-14లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 136 గిగావాట్లు కాగా.. 2023లో ఈ డిమాండ్ 243 గిగావాట్లకు పెరిగింది. మంత్రి మాట్లాడుతూ.. సామర్థ్యాన్ని 194 గిగావాట్లకు పెంచాం.. దీంతో పెరుఉతున్న విద్యుత్‌ డిమాండ్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకుంటుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఏప్రిల్-జూలైలో కురిసిన అకాల వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ కాస్త తక్కువగా ఉండడంతో ఇప్పటికీ ఆశించిన స్థాయి కంటే తక్కువగానే ఉన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)