ముఖానికి సిరా పూసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నిలబెట్టుకున్నారు. తన ముఖానికి సిరా పూసుకున్నారు.  కాంగ్రెస్‌ నాయకుడు ఫూల్‌సింగ్‌ బారయ్య, భాందర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ 50కు పైగా సీట్లు గెలిస్తే తన ముఖానికి నలుపు రంగు పూసుకుంటానని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. మొత్తం 230 స్థానాలకుగాను 163 సీట్లలో బీజేపీ గెలిచింది. మధ్యప్రదేశ్‌లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఫూల్‌సింగ్‌ బారయ్య గురువారం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. అందరి ముందు ముఖానికి నల్ల సిరా పూసుకున్నారు. 'మధ్యప్రదేశ్‌లో బీజేపీ 50 సీట్లకు పైగా గెలిస్తే నా ముఖానికి నలుపు రంగు పూసుకుంటానని నేను హామీ ఇచ్చా. ఆ హామీని నెరవేర్చా. నా ముఖాన్ని నలుపు చేసుకోవద్దని దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు అలా చేశా' అని అన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే తాను సిరా పూసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బారయ్యతో పాటు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)