కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ రైతు రుణ మాఫీల గురించి ప్రస్తావించారు. తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రైతులు ఏటా కరవును కోరుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష భాజపా తీవ్రంగా మండిపడింది. ''రైతులకు కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ విస్తరణకు సహకారం అందించారు. అయితే ఏటా కరవు రావాలని రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేస్తుందని భావిస్తున్నారు. కానీ, మీరు అలా కోరుకోవడం సరికాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. రైతులను అవహేళన చేస్తూ శివానంద మాట్లాడడంపై భాజపా మండిపడింది. పాటిల్‌ను మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ అంతా అజ్ఞానులతో నిండిపోయిందని విమర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అవమానించిందని.. ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని దుయ్యబట్టింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
రైతులపై మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు !
December 25, 2023
0
Tags