బ్లాక్ బస్టర్ 'యానిమల్' సినిమాతో నటుడు బాబీ దేవోల్ జోష్ మీద ఉన్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన విలన్‌గా ఆకట్టుకున్నారు. తాజాగా ఆంగ్ల మీడియాతో బాబీ దేవోల్ మాట్లాడుతూ తన పాత్ర నిడివిపై వస్తోన్న కామెంట్స్ గురించి స్పందించారు. ''దర్శకుడు నాకు పాత్ర గురించి చెప్పి 15 రోజుల షూటింగ్ మాత్రమే ఉంటుందని చెప్పారు. నిడివి తక్కువ అయినా కథ పరంగా ప్రాధాన్యమున్న పాత్ర అది. నాకు ఎంతో సవాలుగా అనిపించింది. ఈ స్థాయిలో విజయాన్ని మాత్రం ఊహించలేదు. నటనకు ఆస్కారమున్న పాత్ర దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారంతా నేను ఇంకా ఎక్కువ సమయం కనిపిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటుడిగా ఇది నాకు ప్రశంసతో సమానం. కానీ, సినిమాలో మన పాత్ర నిడివి కంటే దాని ప్రభావం ఎంత అనేది ముఖ్యం. సందీప్ వంగాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాతో ఆయన నా జీవితాన్ని మార్చేశారు''అని చెప్పారు. ఇక ఈ సినిమా విజయంపై బాబీ దేవోల్ గతంలోనూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.
నా జీవితాన్ని మార్చేశారు !
December 08, 2023
0
Tags