జియో ఫైనాన్స్ నుంచి 'డిజిటల్ పర్సనల్ లోన్' ఆఫర్ !

Telugu Lo Computer
0


రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్  క్రెడిట్ ఫెసిలిటీ ప్రారంభించింది. పర్సనల్ రుణాలు, కన్జూమర్ డ్యూరబుల్ లోన్లు, మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీ మొదలు పెట్టింది. రుణాలు అవసరమైన వారు జియో ఫైనాన్స్, మై జియో మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి జియో ఫైనాన్స్ 'డిజిటల్ పర్సనల్ లోన్లు' ఆఫర్ చేస్తున్నది. జియో ఫైనాన్స్ ద్వారా రుణ పరపతి పొందాలనుకునే వారు తమ మొబైల్ ఫోన్ నంబర్‌తో పాన్ కార్డ్, ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉంటే చాలు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు, ఎయిర్ కండిషనర్లు, కెమెరా కొనుగోలు చేసే వారు రుణాలు లభిస్తాయి. మర్చంట్ వెబ్‌సైట్ల ద్వారా చేసే కొనుగోళ్లపై 'నో-కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్ కింద జియో ఫైనాన్స్ రుణ పరపతి కల్పిస్తున్నది. వ్యాపారులకు రుణాలు కూడా జియో ఫైనాన్స్ మొదలు పెట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)