రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ ఇండియాలోని బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సినిమాలకు కూడా ఇస్తుంటారు. ఇప్పటికే ఈ అవార్డ్స్ నామినేషన్స్‌లో… రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. తెలుగు నుంచి రామ్ చరణ్‌కు పాప్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. దీంతో మెగా పవర్ స్టార్ పేరు సోషల్ మీడియా టాప్ ట్రెండ్ అవుతోంది.
రామ్ చరణ్ కి ఇంటర్నేషనల్ అవార్డు !
December 09, 2023
0
Tags