అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-'ఏ'లో ఉన్న భారత్ తొలుత అఫ్గనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్ సహారన్ సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్‌తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్‌తో రాణించారు. ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది.
నేపాల్‌పై భారత్ ఘన విజయం !
December 12, 2023
0
Tags