రైల్వే స్టేషన్లలో సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేయడంపై కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ప్రజలు సులభతర రైలు ప్రయాణాన్ని కోరుకోవాలా ? సెల్ఫీ తీసుకోవాలా ? అని ప్రశ్నించారు. ఆ పాయింట్ల వద్ద మోడీ కటౌట్‌లను ఏర్పాటు చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. 'రైలు టికెట్ల ధరలు పెంచారు. వృద్ధులకు టికెట్లలో ఇచ్చే రాయితీని ఉపసంహరించుకున్నారు. ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచారు. ప్రైవేటీకరణకు అనువైన పరిస్థితులు కల్పించారు. ప్రజల కష్టార్జితాన్ని సెల్ఫీ స్టాండ్‌ల కోసం వెచ్చిస్తారా..? ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? వారు చవకైన వంట గ్యాస్, సులభతర రైలు ప్రయాణాన్ని కోరుకోవాలా..? లేక సెల్ఫీ పాయింట్లలో ఫొటోలు తీసుకోవాలా..? అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ చిత్రాలతో ఉన్న సెల్ఫీ బూత్‌ల ఏర్పాటును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వ్యతిరేకించారు. ఇది పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. వాటిని ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ల జాబితాను షేర్ చేశారు.
సులభతర రైలు ప్రయాణాన్ని కోరుకోవాలా ? సెల్ఫీ తీసుకోవాలా ?
December 30, 2023
0
Tags