ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల మహిళ తన స్నేహితులతో కలిసి స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నది. వారు రైడ్‌కు వెళ్లగా ఆమె ఒంటరిగా ఉన్నది. గమనించిన జునైద్, ఇమ్రాన్, చంద్, మరో ఇద్దరు ఆ మహిళను నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితుల కోసం సెర్చ్ చేశారు. బాధితురాలు గుర్తించిన జునైద్ ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అయితే పారిపోయేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జునైద్‌ను పోలీసులు ప్రశ్నించగా మిగతా నిందితుల సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్, అతడి ముగ్గురు అనుచరులను పోలీసులు గుర్తించారు. వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఇమ్రాన్ కాళ్లపై కాల్పులు జరిపారు. దీంతో మిగతా నిందితులు పోలీసులకు దొరికిపోయారు. మహిళపై సామూహిక లైంగిక దాడి కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
మహిళపై సామూహిక లైంగిక దాడి !
December 04, 2023
0
Tags