బీహార్‌లో అదానీ గ్రూపు 8700 కోట్ల పెట్టుబడి !

Telugu Lo Computer
0


బీహార్ లో అదానీ గ్రూపు సుమారు 8700 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఆ పెట్టుబడి ద్వారా సుమారు పది వేల ఉద్యోగాలను కల్పించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ తెలిపారు. బీహార్ బిజినెస్ కనెక్ట్ 2023 మీటింగ్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ బీహార్ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా మారిందన్నారు. మార్పు స్పష్టంగా ఉందని, సామాజిక మార్పు కనిపిస్తోందన్నారు. శాంతిభద్రతలు, అక్షరాస్యత, మహిళా సాధికారత లాంటి అంశాల్లోనూ బీహార్ ఉత్తమ విధానాలు పాటిస్తోందన్నారు. సీఎం నితీశ్ కుమార్ అభివృద్ధి మంత్రాన్ని అదాన్నీ గ్రూపు స్వాగతిస్తున్నట్లు ప్రణవ్ తెలిపారు. బీహార్‌లో లాజిస్టిక్స్‌, గ్యాస్ డిస్ట్రిబుషన్ రంగాలకు ఇప్పటికే తమ కంపెనీ దాదాపు రూ.850 కోట్లు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)