బెంగళూరులోని ప్యాలెస్ గుట్ట హల్లి నివాసి సౌమ్య 2019 అక్టోబర్ లో జరిగిన భారీ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ నుంచి షాంపూని కొన్నది. ఆమె కొనుగోలు చేసిన పతంజలి హెయిర్ క్లెన్సర్ అసలు ధర రూ. 95 మాత్రమే. అయితే ఫ్లిప్ కార్ట్ ఆమెను నుంచి రూ. 191 వసూలు చేశారు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఫ్లిప్ కార్ట్ కస్టమర్ సర్వీస్ కు ఫిర్యాదు చేసింది. అక్కడ ఆమెకు రీఫండ్ చేస్తామని చెప్పారు. ఫ్లిప్ కార్ట్ నుంచి ఎంతకీ సమాధానం రాకపోవడంతో ఆమెకు కోపమొచ్చింది. న్యాయం కోసం ఫ్లిప్ కార్ట్ పై దావా వేసింది. బెంగళూరు 4 అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్పూట్స్ రీడ్రెసల్ కమిషన్ లో ఫిర్యాదు చేసింది. అధిక ధరలకు షాంపూ బాటిల్ ను విక్రయించినందుకు ఫ్లిప్ కార్ట్, హచ్ బీకే ఎంటర్ ప్రైజెస్ పై ఫిర్యాదు చేసింది. స్వయంగా ఆమె ఫిర్యాదును దాఖలు చేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా సమర్పించింది. కస్టమర్ నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఫ్లిప్ కార్ట్ కంపెనీ, హెచ్ బీకే ఎంటర్ ప్రైజెస్ లు కోర్టుకు ఎటువంటి సమాధానం చెప్పలేకపోవడంతో సౌమ్యకు అనుకూలంగా జడ్జి తీర్పు ఇచ్చారు. వినియోగదారులకు సేవలందించడంతో లోపానికి పరిహారంగా రూ. 10వేలు, కోర్టు ఛార్జీలు రూ. 5వేలు, మోసపూరిత వ్యాపారం చేసినందుకు రూ. 5వేల చొప్పున మొత్తం రూ.20 వేలు కస్టమర్ సౌమ్యకు ఫ్లిప్ కార్ట్ సంస్థ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఫ్లిప్కార్ట్ నుంచి కోర్టు ద్వారా రూ.20 వేలు వసూలు చేసిన మహిళ !
December 08, 2023
0
Tags