గుండెపోటు హఠాన్మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక కార్యక్రమం నిర్వహించింది. సీపీఆర్‌పై చదువుకున్న వాళ్లకూ అవగాహన లేదని భావిస్తున్న కేంద్రం సీపీఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో 20 లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్షుఖ్ మాండవీయ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. సీపీఆర్ టెక్నిక్‌పై శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ తరహా హఠాన్మరణాలు 12.5 శాతం పెరిగాయి. మంచి ఆహారం తీసుకోవాలని, అయినా ఈ తరహా మరణాలు సంభవిస్తుండడంతో సీపీఆర్‌పైనా అవగాహన ఉండాలని అన్నారాయన. కొవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనాన్ని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. దాదాపు రెండు లక్షల మంది టీచర్లు, కాలేజీ ఫ్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు.
20 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ !
December 06, 2023
0
Tags