చైనీస్ మాస్టర్స్ ఫైనల్లో సాత్విక్ - చిరాగ్ జోడీ

Telugu Lo Computer
0


భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి అంచనాలు అందుకుంటూ.. చైనా మాస్టర్స్‌ సూపర్‌ సిరీస్ 750 టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. షెంజెన్‌లో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ ద్వయం చైనాకు చెందిన హి జి టింగ్, రెన్ గ్జియాంగ్ యుపై గెలుపొందింది. వారం క్రితమే జపాన్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన ఈ చైనా జంటపై భారత జోడీ రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించింది. చివరకు 21-15, 22-20 తేడాతో టింగ్, గ్జియాంగ్ ద్వయాన్ని చిత్తు చేసింది. నిరుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన సాత్విక్ – చిరాగ్‌కు ఇది రెండో ఫైనల్ కావడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)