రైతుబంధు పంపిణీకి అనుమతివ్వాలంటూ ఈసీకి బీఆర్‌ఎస్‌ పార్టీ లేఖ !

Telugu Lo Computer
0


రైతుబంధు స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు సోమవారం లేఖ రాసింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంపిణీకి ఈసీ ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే అనూహ్యంగా నేడు ఆ అనుమతుల్ని ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి ఈసీని ఆశ్రయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అనుమతిని నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. ఈ విషయంలో విపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేశాయని పేర్కొంది. మంత్రి హరీశ్‌ రావు ఈ పథకాన్ని ప్రచారం చేయలేదని.. అనుమతి మంజూరు చేసినందుకు ఈసీకి కృతజ్ఞతలు మాత్రమే తెలిపారని వివరించింది. దీన్ని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించలేమని బీఆర్‌ఎస్‌ పార్టీ తన లేఖలో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)