రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై మెటాకు ఢిల్లీ పోలీసుల లేఖ

Telugu Lo Computer
0


ష్మిక మందన్నాకు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో ఒకటి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు  చర్యలకు ఉపక్రమించారు. మార్ఫింగ్‌ వీడియోపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వీడియో ఏ అకౌంట్‌ నుంచి తొలుత అప్‌లోడ్‌ అయ్యిందో అందుకు సంబంధించిన యూఆర్‌ఎల్‌ వివరాలను అందించాలంటూ ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాను కోరారు. అదేవిధంగా నకిలీ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వారి వివరాలను కూడా అందించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మెటా సంస్థకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)