హీరో సూర్యకు షూటింగ్‌ లో ప్రమాదం !

Telugu Lo Computer
0


కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కంగువ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్య 42 వ ప్రాజెక్ట్‌గా వస్తున్న కంగువ చిత్రం షూటింగ్‌ ఫైనల్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో షూటింగ్‌ ముగించుకుని వచ్చిన కంగువ టీమ్‌, తాజాగా ఫైనల్ షెడ్యూల్‌ చిత్రీకరణనను చెన్నైలో ప్లాన్‌ చేశారు. కంగువ చిత్రం కోసం భారీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్‌ కెమెరా వచ్చి పడంది. దీంతో ఆయన భుజానికి గాయమైంది. వెంటనే షూటింగ్‌ ఆపేసిన యూనిట్‌ సభ్యులు.. సూర్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)