చైనాలోఅంతుచిక్కని నిమోనియా వ్యాధితో స్కూలు విద్యార్థులు పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలవుతుండడంతో దీని తీవ్రతపై వైద్యులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే బీజింగ్, లియోనింగ్ సిటీల్లోని ఆస్పత్రులు బాధితలతో కిక్కిరిసి ఉన్నాయి. అక్కడి తాజా పరిస్థితులు కరోనా మిగిల్చిన చేతు జ్ఞాపకాలను, భయాలను పునరావృతం చేసేలా ఉన్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ నిమోనియా అది వేగంగా వ్యాపిస్తుండటంతో స్కూళ్ల మూసివేత తప్పదని ఇప్పటికే స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ నిమోనియా వ్యాధి బాధిత పిల్లల్లో తీవ్రమైన జ్వరం, ఊపిరితిత్తుల్లో మంట వంటి అసాధారణ లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇతర శ్వాసకోశ వ్యాధుల్లో కనిపించే దగ్గు, ఇతర లక్షణాలు ఈ వ్యాధిలో కనిపించడం లేదని వైద్యులు దృవీకరించారు. ఇప్పటికే బీజింగ్, లియోనింగ్ ఆస్పత్రులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో తాజా పరిస్థితులు మునుపటి కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో అంతుచిక్కని నిమోనియా వ్యాధి ?
November 23, 2023
0
Tags