ప్రపంచంలోనే అత్యధిక లాభాలను ఆర్జించే కంపెనీ ఆరామ్‌కో !

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా ఆయిల్ కంపెనీ సౌదీ ఆరామ్‌కో నిలిచింది. గత సంవత్సరం సౌదీ ఆరామ్‌కో $161.1 బిలియన్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. ఈ క్రమంలో లిస్టెడ్ కంపెనీగా అత్యధిక యాన్యువల్ ప్రాఫిట్ అందుకుంది. చమురు, పెట్రోకెమికల్స్ అమ్మకాలతో గత ఏడాది $400 బిలియన్ల లాభాలు ఆర్జించిన ఈ సంస్థ, ప్రస్తుతం $592 బిలియన్లకు లాభాలను పెంచుకుంది. ఫలితంగా సౌదీ ఆరామ్‌కోను ఫార్చ్యూన్ మేగజీన్ ఆగస్టులో అత్యంత లాభదాయకమైన కంపెనీగా గుర్తించింది. 2022లో సౌదీ ఆరామ్‌కో రెవెన్యూ $604.4 బిలియన్లకు చేరుకోగా, మార్కెట్ వాల్యూ $2.1 ట్రిలియన్స్‌గా నమోదైంది. సౌదీ ప్రభుత్వానికి ఆరామ్‌కోలో 90% పైగా వాటా ఉంది. ఒక శాతం వాటాను 2019లో దేశ స్టాక్ ఎక్స్‌ఛేంజీలో నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 30 నాటికి సౌదీ ఆరామ్‌కో నికర ఆదాయం $32.6 బిలియన్లు కాగా, ఫ్రీ క్యాష్‌ ఫ్లో $20.3 బిలియన్లుగా ఉంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం, డౌన్‌స్ట్రీమ్ రిటైల్ కొనుగోళ్ల ద్వారా దక్షిణ అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ఈ లాభాలకు కారణంగా తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)