పటాకులు కాల్చుతూ బైక్‌పై స్టంట్లు !

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరుచ్చిలో ఒక వ్యక్తి బైక్‌కు అమర్చిన పటాకులు కాల్చుతూ దానిని నడిపాడు. కొందరు యువకులు పటాకులు కాల్చుతూ బైక్‌పై స్టంట్లు చేశారు. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవంబర్ 9న షేర్ చేసిన ఈ బైక్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఆ యువకుడ్ని పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్‌ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తమిళనాడులో దీపావళి సందర్భంగా మరి కొందరు యువకులు కూడా బైక్‌ స్టంట్లు చేస్తూ క్రాకర్స్‌ కాల్చారు. అలాగే ఒక వ్యక్తి కారుపై అమర్చిన పటాకులు కాల్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో క్లిప్స్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇవి పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొందరిని అరెస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)