కేరళ పర్యాటక శాఖకు గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు !

Telugu Lo Computer
0


కేరళ పర్యాటకు శాఖ 2023 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు'ని కైవసం చేసుకుంది. గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్టనర్‌షిప్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం (ఐసీఆర్‌టీ), బెస్ట్ ఫర్ లోకల్ సోర్సింగ్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. మహిళల నేతృత్వంలోని చిన్న, మధ్య తరహా సంస్థలను పర్యాటక కార్యకలాపాలకు అనుసంధానించారు. స్వదేశీ ఉత్పత్తులనే మార్కెటింగ్‌ చేశారు. అందుకు రాష్ట్ర మిషన్ సమ్మిళిత పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దాంతో అత్యంత విలువైన అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ 2030' ద్వారా మరింత ప్రోత్సహం అందిస్తుంది. ఈ మిషన్‌ ప్రకారం 2030 వరకు రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 12​‍-20 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)