ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను శుక్రవారం తగ్గించింది. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. నవంబర్ 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వాణిజ్య సిలిండర్‌పై రూ.57.5 వరకు ధరలు తగ్గించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గాయి. దీపావళికి ముందు సిలిండర్‌పై రూ. 101.5ల పెంపు తర్వాత ఉపశమనం పొందింది.సవరించిన ధరల ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1,775, కోల్‌కతాలో రూ.1,885, ముంబయి నగరంలో రూ.1,728, చెన్నైలో రూ.1,942 రూపాయలకు తగ్గింది.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు !
November 17, 2023
0
Tags