మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోరెనా జిల్లాలోని మిర్ఘన్‌లో ఈ సంఘటన జరిగింది. డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 147, 148 వద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2533 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 45 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
November 17, 2023
0
Tags