వాయువ్య కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో తొలిసారిగా యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్‌లు కొనుగోలు చేసే విధానం తీసుకురాదలచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ భరత్ తెలిపారు. హుబ్బళ్ళిలో మీడియాతో మాట్లాడుతూ హుబ్బళ్ళి గ్రామీణ విభాగం 3వ డిపో పరిధిలో యూపీఐ చెల్లింపుల ద్వారా ప్రయాణాల విధానం ఇటీవల ప్రవేశపెట్టామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన మేరకు వాయువ్య కర్ణాటక రీజియన్‌లో పూర్తిగా యూపీఐ చెల్లింపులను అమలులోకి తీసుకురాదలచామన్నారు. ప్రజారవాణా మరింత వెసలుబాటు తీసుకురావాలనే సేవలు తీసుకురాదలచామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను పెంచుతున్న తరుణంలో రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లలో తొలిసారిగా వాయువ్య రీజియన్‌లో యూపీఐ చెల్లింపుల ప్రక్రియ తీసుకురాదలచినట్లు తెలిపారు. ప్రతి కండెక్టర్‌కు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయిస్తామన్నారు. టికెట్ మిషన్‌కు క్యూఆర్ కోడ్‌ను అనుసంధానం చేసే ఆలోచన ఉందన్నారు. తద్వారా చిల్లర స మస్యలు ఇకపై ఉండవని తేల్చి చెప్పారు. హుబ్బళ్ళి గ్రామీణ డిపో పరిధిలో ఫోన్‌పే ద్వారా చెల్లింపులు జరిపామని రీజియన్ వ్యాప్తంగా ఎవరితో ఒప్పందం చేసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.
కేఎస్ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులకు శ్రీకారం
November 17, 2023
0
Tags