మాదిగల విశ్వరూప మహాసభలో ఆసక్తికర సన్నివేశం. సభకు హాజరైన ప్రధాని మోడీ ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగను వేదికపైనే ఆలింగనం చేసుకుని హత్తుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. మోడీ ఆలింగనంతో కృష్ణమాదిగ ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. దీన్ని చూసిన ప్రధాని మోడీ తన సీటు పక్కనే మంద కృష్ణ మాదిగను కూర్చోబెట్టుకున్నారు. కుర్చీని దగ్గరకు తీసుకుని అతని భుజంపై చేయి వేసి మంద కృష్ణ మాదిగను ఓదార్చారు. ఐదు నిమిషాలపాటు ఈ దృశ్యం సభలో ఆసక్తి రేపింది. ప్రధాని స్థాయి వ్యక్తి తనకు ఇచ్చిన గౌరవం, సభకు హాజరైన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో సభ హోరెత్తింది.
మోడీ ఆలింగనంతో కృష్ణమాదిగ ఆనందంతో కన్నీటి పర్యంతం !
November 11, 2023
0
Tags