అధికారంలోకి వస్తే అర గంటలో హైదరాబాద్ పేరు మారుస్తాం !

Telugu Lo Computer
0


తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. చార్మినార్ వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పరని కూడా అన్నారు. 2024, ఫిబ్రవరి నాటికి అస్సాంలో యూసీసీ అమల్లోకి వస్తుందని చెప్పారు. యూసీసీ అమల్లోకి వస్తే ఒక వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేందుకు వీలుండదని అన్నారు. యూసీసీ ప్రకారం.. మరో మహిళను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ముందుగా విడాకులు ఇచ్చిన తర్వాతే రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 2023, ఫిబ్రవరిలో మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్ పేరును 'ఛత్రపతి శంభాజీ నగర్'గా, ఉస్మానాబాద్ నగరానికి 'ధరాశివ్'గా పేరు మార్చేందుకు ఓకే చెప్పింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)