కరోనా సమయంలో చికెన్‌ను విపరీతంగా తినడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.. ఇప్పుడు సగానికి పడిపోయింది. కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. ప్రస్తుతం కిలో చికెన్ విత్ స్కిన్ రూ. 150, స్కిన్‌లెస్ రూ. 170కి పడిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో కనిష్ట ధర ఇదే కావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ధరలు పూర్తిగా తగ్గాయి.. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
భారీగా తగ్గిన చికెన్ ధరలు !
November 22, 2023
0
Tags