రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యలో హంతకులకు బీజేపీతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కన్హయ్య లాల్ హత్య జరిగిన కొద్ది రోజులకే బీజేపీ వారిని మరో కేసు నుంచి విడిపించిందని, కొందరు బీజేపీ నేతలు వారిని స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిని విడిపించుకుని వచ్చారంటూ గెహ్లాట్ చెప్పారు. జోధ్‌పూర్‌కు ప్రచార యాత్రలో భాగంగా విలేకరులతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎకు బదులుగా రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి) ఈ కేసును విచారణ చేసుంటే దోషులకు ఇప్పటికే శిక్ష పడేది అని అన్నారు. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడని గత ఏడాది జూన్ 28న పట్టపగలు ఇద్దరు దుండగులు ఉదయ్‌పూర్‌లోని తన షాపులో కన్హయ్య లాల్ ను నరికి చంపారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు !
November 13, 2023
0
Tags