తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన భారీ రోడ్ షో ముగిసింది. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో కాచిగూడ వరకు సాగింది. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు దీనికి పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు. కాగా, ఈ యాత్రలో ఒక ప్రత్యేకత ఉంది. మోడీ కాన్వాయ్ వెళ్లే వెంట 25 వేదికలను ఏర్పాటు చేశారు. ఒక్కో వేదికపై ఒక్కొ నియోజకవర్గ అభ్యర్థి ఉండి, మోడీ రోడ్ షోకి తన మద్దతు దారులతో కలిసి స్వాగతం పలికారు. గతంలో కూడా మోడీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని అందుకుంది. అయితే కర్ణాటకలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమల పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
హైదరాబాద్ లో ప్రధాని మోడీ మెగా రోడ్ షో !
November 27, 2023
0
Tags