పోలీస్ యూనిఫాంలో రీల్స్ చేసినందుకు సస్పెండ్ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ కు కస్ గంజ్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆర్తీ సోలంకి, సహవర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోంది. సోలంకికి రీల్స్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ చేయడం అలవాటు. దీంతో తరుచుగా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు పోలీస్ యూనిఫాంలోనే డ్యూటీలో ఉండి రీల్స్ చేసింది. 1980లో అమితాబ్ బచ్చన్ , శత్రుఘ్న సిన్హా నటించిన యాక్షన్ డ్రామా దోస్తానా లోని తేరీ మేరీ దోస్తీ ప్యార్ మే బాదల్ గయా' సాంగ్ కు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. అయితే సోలంకీ చేసిన తప్పేంటంటే డ్యూటీ లో ఉండి పోలీస్ యూనిఫాంలో ఆ పాటకు యాక్ట్ చేసింది. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియాలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లింది. వీడియో చూసిన జిల్లా ఎస్పీకి చిర్రెత్తుకొచ్చింది. డ్యూటీలో ఉండి చేసే పనులు ఇవా అంటూ చీవాట్లు పెట్టాడు..డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)