రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమాన్‌గఢ్‌లో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం తప్పితే వాళ్లు దేశానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందని, కానీ వాళ్లు పోరాడిందేమీ లేదని, ఒక్కరు కూడా జైలుకి వెళ్లిన దాఖలాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన వాళ్లు చుక్క రక్తం కూడా చిందించలేదు. ఎంతమంది బీజేపీ వాళ్లు జైలుకు వెళ్లారు? దేశం కోసం ఎంతమంది బీజేపీ వాళ్లు పోరాడారు? పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోరాడింది. వాళ్లు పోరాడిందేమీ లేదు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్ కలిసి దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు'' అని మల్లికార్జున ఖర్గే తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తమ కాంగ్రెస్ రాజస్థాన్‌లో ఏడు హామీల్ని ప్రకటించిందని, తాము తిరిగి అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ హామీలను నెరవేరుస్తామని ఖర్గే ప్రకటించారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ !
November 20, 2023
0
Tags