క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో సెమీఫైనల్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఇండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. నవంబర్ 15వ తేదీ ముంబై వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో.. ఇంగ్లాండ్ ఇచ్చిన టార్గెట్ ను.. ఆరు ఓవర్లలో చేధించాల్సి ఉంది పాకిస్తాన్. అయితే ఇది సాధ్యం కాకపోవటంతో.. పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది. దీంతో న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ 16వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ కోల్ కతాలో జరగనుంది.
భారత్ - న్యూజిలాండ్, సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ !
November 11, 2023
0
Tags