పన్నూ హత్యకుట్ర కేసులో భారత్‌ పై అమెరికా ఆరోపణలు !

Telugu Lo Computer
0


ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌' నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూను హతమార్చాలన్న కుట్రలో భారతీయ పౌరుడి ప్రమేయం ఉందంటూ అమెరికా  మోపిన అభియోగాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఇది ఆందోళన కలిగించే విషయమని, తమ విధానాలకు పూర్తి విరుద్ధమని ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. కుట్ర కేసులో నిందితుడికి భారత అధికారితో సంబంధం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళనకరమని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ఇది భారత ప్రభుత్వ విధానానికి విరుద్ధమని స్పష్టం చేశామన్నారు. వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య సంబంధాలు, తదితర అంశాలు తీవ్రమైన సమస్య అన్నారు. దానివల్లే ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ గుర్తించిన అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. 'కెనడా విషయానికొస్తే.. ఆ దేశం భారత్ వ్యతిరేక శక్తులకు స్వర్గధామంగా మారిందని మేం ఇప్పటికే పలుమార్లు వెల్లడించాం. అదే ప్రధానమైన సమస్య. కెనడాలోని మన రాయబారులు ఆ భారాన్ని భరించారు. దౌత్యసంబంధాలకు ఉద్దేశించిన వియన్నా ఒప్పందాన్ని కెనడా గౌరవించాలని మేం ఆశిస్తున్నాం. మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించం' అని బాగ్చి మీడియాతో వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)