కేరళలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌లో ట్రయల్ రన్ జరుగుతుండగా భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేవల్ బేస్‌లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ గరుడ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్‌తో సహా ఇద్దరు గాయ పడగా, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది. INS చేతక్ హెలికాప్టర్ నౌకాదళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్.
కుప్పకూలిన నేవీ హెలికాప్టర్ !
November 04, 2023
0
Tags