ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక ట్యూషన్‌కు వెళ్తున్నది. మోడీ నగర్ ప్రాంతంలోని జగత్‌పురి కాలనీలో 35 ఏళ్ల షౌకిన్ ఆమెను అడ్డుకున్నాడు. ఆ బాలికకు తెలిసిన వ్యక్తి అయిన అతడు ఆ ట్యూషన్‌కు వెళ్లవద్దంటూ కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు కొందరు షౌకిన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల కోసం అతడ్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ ఒక పోలీస్ నుంచి పిస్టల్ లాక్కున్నాడు. గాలిలోకి కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయమైన అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ రెండు సంఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై కత్తితో దాడి చేసి, పోలీస్ నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులు జరిపాడు !
October 07, 2023
0
Tags