ముకేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపులు !

Telugu Lo Computer
0


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీకివారం వ్యవధిలోనే మూడోసారి ఆయనకు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఈ సారి ఆగంతకుడు రూ. 400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. షాదాబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఖాతా నుంచి ఈ మెయిల్స్‌ వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యక్తి జర్మనీలోని బెల్జియం నుంచి మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మొదటగా అక్టోబర్‌ 27న రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తూ షాదాబ్‌ ఖాన్‌ అనే పేరు నుంచి.. ముకేశ్‌ అంబానీకి బెదిరింపు మెయిల్‌ పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అదే ఈమెయిల్‌ ఐడీ నుంచి వరుసగా బెదిరింపులు వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తమ వద్ద ఉన్న షూటర్లు చంపేస్తారంటూ అందులో నిందితుడు హెచ్చరించాడు. రెండ్రోజుల క్రితం రూ.200 కోట్లు డిమాండ్‌ చేయగా.. తాజాగా మూడోసారి బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)