బీహార్ లో యూట్యూబర్ హత్య

Telugu Lo Computer
0


బీహార్ లో హరధన్ అనే 19 ఏళ్ళ యువకుడు తండ్రిని కోల్పోయాడు. దీనితో కుటుంబ భారం ఆ యువకుడి పైన పడింది. ఈ నేపథ్యంలో తన తల్లిని, ఇద్దరు సోదరీమణులను పోషించుకునేందుకు హరధన్ యూట్యూబ్‌లో ట్యూషన్లు మరియు రీల్స్ అప్‌లోడ్ చేసేవాడు. దీనితో హరధన్ కి యూట్యూబ్ లో మంచి గుర్తింపు వచ్చింది. హరధన్ కి వచ్చిన ఈ గుర్తింపు అతని మరణానికి కారణం అయింది. హరధన్ కి నేమ్, ఫేమ్ రావడాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు బీహార్‌లోని నలందలో తన ఇంట్లో నిద్రిస్తున్న హరధన్ ను పదునైన కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు గుమిగూడి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హరధన్ సోదరి మాట్లాడుతూ యూట్యూబ్ లో ఫేమ్ రావడం వల్లనే అతన్ని హత్య చేశారని తెలిపింది. కాగా ఈ హత్యకు కేవలం యూట్యూబ్ ఫేమ్ మాత్రమే కారణమా ? లేక వేరే కారణాలు ఎం అయినా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)