ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ఎన్నో వింతలు విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ ఇలాంటి విశేషాలను చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ మాయలో మునిగి తేలుతున్నారు. పెద్దలు చిన్నలు అనే తేడా లేకుండా అందరూ కూడా సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతికేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సోషల్ మీడియా కొంతమందికి ఇలా ఎంటర్టైన్మెంట్ అందిస్తే ఇంకొంతమందికి మాత్రం ఆదాయాన్ని అందిస్తుంది అని చెప్పాలి. సైకిల్‌ను సామాన్యుడి వాహనమని అంటారు. సైకిల్‌పైనే ప్రయాణం కొనసాగిస్తూ అనేక పనులు పూర్తి చేస్తుంటారు చాలామంది. ఇటువంటి అవసరాల కోసమే కాకుండా సైకిల్‌ను ఆరోగ్య ప్రదాయినిగా వైద్యులు చెబుతుంటారు. సైకిళ్లను మనం రోడ్లపై, వీధుల్లో, పొలాల వద్ద చూస్తుంటాం.దాన్ని ఎప్పుడైనా మెట్రో ట్రైనులో చూశారా? ఇటువంటి దృశ్యమే తాజాగా ముంబై మెట్రో ట్రైనులో కనపడింది. ఓ యువకుడు తన సైకిల్ ను మెట్రో ట్రైనులో తీసుకెళ్లి, వీడియో తీసుకున్నాడు. దీంతో ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటిదే మరో వీడియో వెలుగు చూసింది.
మెట్రో రైళ్లల్లో సైకిళ్లు తీసుకెళ్లొచ్చా ?
October 23, 2023
0
Tags