తెలంగాణలోని నిజామాబాద్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు. అనంతరం గవర్నమెంటు ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అని ఆయన చెప్పారు. వర్షం కురిసినా ఇబ్బందిలేకుండా రెండు లక్షల మంది కూర్చునేలా సభను ఏర్పాటు చేసినట్లు ఎంపీ అర్వింద్ వెల్లడించారు. ఈ సభకు మొదట ఇందూరు జనగర్జన పేరు పెట్టారు. కానీ, పాలమూరు వేదికగా రాష్ట్రానికి ప్రధాని మోడీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో సభను ధన్యవాద్ సభగా మార్చినట్లు బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో వచ్చి పసుపు బోర్డు ఇస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలుపాలని ఎంపీ అర్వింద్ కోరారు. ఇక, నేడు గ్రౌండ్ మొత్తం ఎస్పీజీ అధికారుల కంట్రోల్లోకి వెళ్లనుంది. వారి ఆధీనంలోకి వెళ్లాక వ్యక్తుల రాకపోకలపై నిఘా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త కలెక్టరేట్లోని హెలిపాడ్లో హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యాక ప్రత్యేక మార్గంలో ప్రధాని మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ఐదు నిమిషాల్లో చేరుకుంటారు. మొత్తం 2 వేలకు పైగా పోలీసులు ప్రధాని బందోబస్తులో పాల్గొన్నారు.
రేపు నిజామాబాద్ ప్రధాని పర్యటన !
October 02, 2023
0
Tags