ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కి మరో మూడురోజులు ఈడీ కస్టడీ

Telugu Lo Computer
0


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ రోస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. సంజయ్‌ సింగ్‌కు ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు మూడురోజులు రిమాండ్‌కు ఇస్తూ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 13 వరకు ఆప్‌ నేత ఈడీ రిమాండ్‌లోను ఉండనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో లంచం డిమాండ్‌ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. మద్యం పాలసీ కేసులో ఈ నెల 4న ఈడీ అరెస్టు చేసిన విషయం విధితమే. దాదాపు పదిగంటలకుపైగా ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మరో వైపు సంజయ్‌ సింగ్‌ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆయన మద్దతుదారులు వేలాది మంది కోర్టు ఆవరణలో నిరసన చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)